హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగాయలంకలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు

నాగాయలంకలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి సమన్విత పార్వతి సమేత నగరేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవార్లను కమిటీ ఆధ్వర్యంలో సరస్వతి దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు కొల్లిపర సుబ్బారావు పూజలు చేశారు. మహిళలు, విద్యార్థులు సరస్వతి పూజ చేశారు.