హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఎదురుచూపులు

NLG: జిల్లా వ్యాప్తంగా వర్షాకాలం పంట కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి రైతులు ప్రభుత్వ కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో, రైతులు మిల్లర్ల వద్ద ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరుతున్నారు.