హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలి'

ADB: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యుత్ సమస్యలపై శుక్రవారం నిర్వహించిన ఆదిలాబాద్‌ ఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు.