హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమలో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణకు రూ.240 కోట్లు

కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఆధునీకరణకు రూ.240 కోట్లు మంజూరు చేయడంపై పీసీసీ సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. మల్కిపురంలో ఆయన మాట్లాడుతూ..సింగిల్ ఫేజ్ నెట్‌వర్క్‌లను త్రీ ఫేజ్ వ్యవస్థగా మార్చి, నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల సమస్యలను పరిష్కరించాలన్నారు