హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన పద్మాక్షి అమ్మవారు

HNK: హనుమకొండ పద్మాక్షి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరో రోజున మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారికి కాత్యాయని క్రమంలో నవకలశాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రధాన పూజారి నాగిళ్ల శంకర్ శర్మ, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.