హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండగ వేళ ఆర్టీసీ స్పెషల్ ఛార్జీల వసూళ్లు

NZB: పండగల వేళ ఆర్టీసీ సాధారణ బస్సులకే ‘స్పెషల్’ స్టిక్కర్లు వేసి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు. జేబీఎస్‌ నుంచి ఆర్మూర్‌కు సాధారణ ఛార్జీ రూ.310 ఉండగా, రూ.410 వసూలు చేస్తున్నారని తెలిపారు. స్పెషల్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.