ASR: స్థానిక ఎన్నికల్లో సర్వే ఆధారంగానే ఎంపీటీసీ టికెట్లు కేటాయిస్తామని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తెలిపారు. డుంబ్రిగుడ మండలం కురిడి పంచాయతీ వైసీపీ నాయకులు శుక్రవారం అరకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'


