హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధిహామీ పనుల పరిశీలన

JGL: రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామం నల్లగుట్ట వద్ద కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, మాస్టర్ రోల్స్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ గంగు రామస్వామిగౌడ్, ఉపసర్పంచ్ నర్సారెడ్డి, కార్యదర్శి స్వర్ణ ఉన్నారు.