హైదరాబాద్: 28°C
తెలంగాణ

సౌత్ జోన్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలు

NRML: నిర్మల్ పట్టణంలోని NTR మినీస్టేడియంలో సౌత్ జోన్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నిర్మల్ నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ బాలబాలికల క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి.