హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరిహద్దులో బెల్లం ఊట ధ్వంసం

ASR: ఏపీ-ఒడిశా సరిహద్దులో అక్రమ నాటుసారా తయారీపై రెండు రాష్ట్రాల ఎక్సైజ్, పోలీసు శాఖలు శుక్రవారం సంయుక్త దాడులు నిర్వహించాయి. కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్‌లో 53 మంది సిబ్బంది చేపట్టిన దాడుల్లో 7,000 లీటర్ల బెల్లం ఊట, 310 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.