SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని పలు రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగుల తో కప్పి వేశారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు


