హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో తొలిరోజు 13 నామినేషన్లు.. ఛైర్మన్‌కు నిల్

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు శుక్రవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. 52 వార్డులకు గాను వైసీపీ నుంచి 12 మంది, స్వతంత్ర అభ్యర్థిగా అగ్గారపు శ్రీనివాసులు నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. ఛైర్మన్ పదవికి తొలిరోజు నామినేషన్ దాఖలు కాలేదు.