హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తిగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు

NGKL: అచ్చంపేట మండలం హాజీపూర్‌‌లో పేదల కోసం చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు ఎనిమిదేళ్లుగా పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. భవనాల చుట్టూ కంపచెట్లు పెరిగి నిరుపయోగంగా మారాయి. సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలు నిరాశ చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నారు.