MDK: జిల్లా కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ బతుకమ్మకు పూజలు చేసి మహిళలతో కలిసి ఆడిపాడారు. పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతని, పండుగ విశిష్టతను భావితరాలకు చాటాలని కోరారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో DRDOప్రథమ, జిల్లా సంక్షేమ శాఖ ద్వితీయ స్థానాలు సాధించాయి. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పూలను దైవాలుగా కొలిచే పండుగ బతుకమ్మ: కలెక్టర్


