హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్లపై పశువుల సంచారంతో వరుస ప్రమాదాలు

BPT: వేటపాలెం మండలం కొత్తపేటలో రహదారులపై పశువుల సంచారం ప్రమాదకరంగా మారింది. ఆవు దాడిలో విశ్రాంత ఎస్సై వెలుగోలు రామకోటేశ్వరరావు తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, ఒక మహిళ తృటిలో తప్పించుకున్నారు. మరో ఘటనలో గోమాత మృతి చెందింది. ప్రమాదాలు నివారించేందుకు అధికారులు రహదారులపై పశువుల సంచారాన్ని తక్షణమే నియంత్రించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.