హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కంకి నల్లితో అప్రమత్తంగా ఉండాలి'

PDPL: వరి పంటలో కంకి నల్లి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంపత్ ఓదెల సూచించారు. ఈ తెగులు వల్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, కంకులు సరిగా అభివృద్ధి చెందక దిగుబడి తగ్గుతుందన్నారు. పొలాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, కలుపు మొక్కలు, పంట అవశేషాలను తొలగించాలని సూచించారు.