హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మెరుగు పేరుతో బంగారు గొలుసు చోరీ

WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్‌లో శుక్రవారం నగలకు మెరుగు పెడతామంటూ వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఓ మహిళ వద్ద సుమారు మూడు తులాల బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలి కేకలతో అప్రమత్తమైన స్థానిక యువకులు దుండగులను వెంబడించగా, వారికి గాయాలైనట్లు సమాచారం. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.