హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సరస్వతి దేవిగా కనకదుర్గమ్మ అమ్మవారు

NTR: వీరులపాడు మండలం జగన్నాథపురంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.