SRPT: పండుగల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అర్వపల్లి ఎస్సై మధు హెచ్చరించారు. అల్లర్లు సృష్టించినా, మహిళలను వేధించినా లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. బైండోవర్ అయిన వ్యక్తులు నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలందరూ సోదరభావంతో ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని ఎస్సై తెలిపారు.
తెలంగాణ
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్సై మధు


