హైదరాబాద్: 28°C
తెలంగాణ

చికిత్స పొందుతున్న యువకుడిని పరామర్శ

WNP:పెదగూడెం గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి పురుగుల మందు తాగి వనపర్తి జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు ఖాదర్ పాషా ఆసుపత్రికి వెళ్లి యువకుడిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.