హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగ్గురు బైక్ దొంగలు అరెస్ట్

EG: సీతానగరం మండలంతో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 14 ద్విచక్ర వాహనాలతో పాటు రూ. 1,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీసిహెచ్ జీవన తెలిపారు. నిందితులు మిర్తిపాడు, ఉండేశ్వరం పాటు గోకవరం, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, రైల్వే స్టేషన్, దేవరపల్లిలో చోరీ చేశారన్నారు.