హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూలా నక్షత్రం.. కిటకిటలాడిన కొండ

శరన్నవరాత్రుల ఆరో రోజైన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి, క్యూలైన్లు కిక్కిరిశాయి. కొండపైకి వాహనాలను అనుమతించలేదు. ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. సుమారు 2.5 లక్షల మంది వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులూ భారీగా తరలివస్తున్నారు.