హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన దండి లక్ష్మి

SDPT: హుస్నాబాద్‌లో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ టి. మల్లికార్జున్ శుక్రవారం పరిశీలించారు. ప్రధాన బతుకమ్మ ఘాట్లు, చెరువుల వద్ద జరుగుతున్న పనులను సమీక్షించారు. పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.