హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీబీ-జీ రామ్ జీ పనులను పరిశీలించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్

JGL: రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద జరుగుతున్న వీబీ-జీ రామ్ జీ పనులను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి ఆకస్మికంగా పరిశీలించారు. ఎంపీడీవో చిరంజీవితో కలిసి ఫామ్ పాండ్ పనుల నాణ్యత, కొలతలు, మస్టర్ రోల్స్‌ను తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి వేతనాలు, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు.