హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత మాక్ టెస్ట్ విజయవంతం

SDPT: సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత SI ప్రిలిమ్స్ మొదటి మాక్ టెస్ట్‌ను నిర్వహించారు. ఈ పరీక్షకు 300 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ప్రిలిమ్స్‌కు ముందు తమ ప్రతిభను అంచనా వేసుకోవడానికి, సమయ నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడిందని అభ్యర్థులు తెలిపారు. పోలీసు ఖాకీ యూనిఫాం కల నెరవేరాలని కమిషనరేట్ అధికారులు ఆకాంక్షించారు.