హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MNCL: మంచిర్యాల కాలేజ్ రోడ్డులోని ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.