హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి ఇన్నోవేషన్ పంచాయతీ వాయిదా : అ. కలెక్టర్

MLG: ములుగు కలెక్టరేట్‌లో శనివారం జరగాల్సిన 'ఇన్నోవేషన్ పంచాయతీ' కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అదనపు కలెక్టర్ సంపత్ రావు శుక్రవారం ప్రకటించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఆవిష్కర్తలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.