హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి కలిదిండి సుజాత దరఖాస్తు

WG: జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి భీమవరం ఏఎంసీ ఛైర్‌పర్సన్ కలిదిండి సుజాత, రామచంద్రరాజు దరఖాస్తు సమర్పించారు. శుక్రవారం టీడీపీ ఇంఛార్జ్ తోట సీతారామలక్ష్మిని కలిసి దరఖాస్తు అందజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి తమ సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించాలని వారు కోరారు. అధిష్టాన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని సీతారామలక్ష్మి తెలిపారు.