ప్రకాశం: వర్షాలు కురవక నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని శుక్రవారం గిద్దలూరులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని కొంగలవీడు రోడ్డులో ఉన్న ఈద్గాలో శుక్రవారం మధ్యాహ్నం సుమారు 350 మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు చేశారు. వర్షాలు కురిసి ప్రజలు, రైతుల కష్టాలు తొలగాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు కురవాలని ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు


