హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో స్థానికుల ఆందోళన

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు వెలిశాయి. వాహనాలను రోడ్డుపైనే నిలపడంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోంది. పండుగ రద్దీతో సమస్య మరింత పెరిగిందని ఆందోళన చెందుతున్నారు.