హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల ఆందోళనకు MP ఈటల రాజేందర్ మద్దతు

HYD: ఇందిరాపార్క్ సమీపంలో ఎన్‌హెచ్‌ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నాలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని, డిమాండ్‌లను నెరవేర్చాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల ధర్నాలో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.