హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే మానవత్వం'

ADB: రూరల్ మండలంలోని యాపలగూడ పోలీస్ బెటాలియన్‌లోని TGSP సిబ్బందికి మానవ, నైతిక విలువలపై ఉమ్మడి జిల్లా SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ శుక్రవారం అవగాహన కల్పించారు. ప్రతి మనిషి ఎదుటివారికి చేతనైన సహాయం చేయడమే నిజమైన మానవత్వమన్నారు. పోలీస్ వ్యవస్థలో ఉద్యోగం ఎంతో ఏకాగ్రతతో చేయాల్సి ఉంటుందని, అందుకే మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు.