హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్ఞాన సరస్వతి దేవతకు ఎమ్మెల్యే సతీమణి పూజలు

NGKL: అచ్చంపేట పట్టణంలోని నవరాత్రి సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవిని అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి చిక్కుడు అనురాధ శుక్రవారం దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చదువుల తల్లి సరస్వతి దేవి ఆశీస్సులు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు.