హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: హనుమకొండ వికాస్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 16 వేల కుటుంబాలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరయ్యాయని, గత పదేళ్లుగా రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో అనేక పేద కుటుంబాలు సంక్షేమ పథకాలకు దూరమయ్యాయన్నారు.