హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇది కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరవు: సండ్ర

KMM: రాష్ట్రంలో నీరు, విద్యుత్ కొరత కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. శుక్రవారం జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొదటి పంటకే నీళ్లివ్వకుండా, రెండో పంట వేయవద్దనడం సిగ్గుచేటన్నారు. కమిషన్ ల కోసమే సింగరేణి బొగ్గు తగ్గించి, విదేశీ బొగ్గు తెస్తున్నారన్నారు. పంట నష్టపరిహారంపై శ్వేతపత్రం ఇవ్వాలన్నారు.