హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుణశ్రీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు

HYD: చిన్నారి గుణశ్రీ మరణం నేపథ్యంలో మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ పాప మరణానికి ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ గుణశ్రీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. పాప వైద్య నివేదికలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నిరసనకు దిగిన గుణశ్రీ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.