హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో ఆయుష్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ములుగు జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19 నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ సునీత తెలిపారు. దరఖాస్తుతో విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలు జతచేసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని ఆయుష్ విభాగంలో సమర్పించాలన్నారు.