హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదవుల వేలం, ప్రలోభాలకు పాల్పడితే చర్యలు: కలెక్టర్

KRNL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల పదవులను వేలం వేయడం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏకగ్రీవం చేయడం చట్టరీత్యా నేరమని కలెక్టర్ డా. ఏ. సిరి హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.