హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రథమ స్థానం

MDK: జిల్లా స్థాయిలో నిర్వహించిన పోషణ మేళాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రథమ బహుమతి సాధించింది. పోషకాహారం ప్రాముఖ్యత, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమాసింగ్‌ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభావతి ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.