హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ వద్ద ఉద్యమ కళాకారుల దీక్ష

MDK: తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యమ కళాకారులకు 1,000 ఉద్యోగాలు ఇవ్వాలని కళాకారుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి కళాకారునికి హెల్త్ కార్డులు, ఉచిత రవాణా సౌకర్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని కోరారు.