KRNL: పుంగనూరులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడిని ఆదోని మాజీ ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. నామినేషన్ ప్రక్రియకు వెళ్తున్న ఎంపీపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే


