హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్‌ ఎస్సైగా కేశవ్‌ బాధ్యతల స్వీకరణ

BDK: భద్రాచలం పట్టణ నూతన ట్రాఫిక్‌ ఎస్సైగా పడాల కేశవ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చర్లలో ఎస్సైగా పనిచేసిన ఆయన, పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణ, రహదారి భద్రతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.