హైదరాబాద్: 28°C
తెలంగాణ

'18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి'

BDK: 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ సూచించారు. ఇల్లందు సింగరేణి హైస్కూల్‌లో నమోదు శిబిరాలను తనిఖీ చేసి, ఫారం-6 దరఖాస్తులను పరిశీలించారు. అర్హులు సమీప పోలింగ్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, శిబిరాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.