హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ సమావేశం

ELR: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. భీమడోలు సీఐ కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్, తహశీల్దార్, ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులపై సమీక్షించారు.