హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల తనిఖీ

PLD: చిలకలూరిపేట మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆర్వో లీలారాణి, రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్సై అనిల్ కుమార్ పరిశీలించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వసతులను తనిఖీ చేశారు. ఎన్నికల్లో గొడవలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీషీట్లు తెరుస్తామని ఎస్సై హెచ్చరించారు. ఎన్నికలకు సహకరించాలని కోరారు.