హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను పరిశీలించిన CMD

KMM: జిల్లాలోని అరెంపుల, కూసుమంచి, అన్నారుగూడెం, ఏన్కూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లను టీజీ ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లు దెబ్బతింటే వెంటనే మార్చాలని అధికారులకు సూచించారు.