SDPT: బెజ్జంకి: మండలంలో శుక్రవారం జెడ్పీ సీఈవో రమేష్ పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల వద్ద వాడుక నీరు భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను తనిఖీ చేసి, పనుల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, సర్పంచ్ బొల్లం శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన


