హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా కుంకుమ పూజ, అన్నదానం

SDPT: నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఓ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్థులు కులమతాలకు అతీతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఉత్సవాలకు సహకరించిన గ్రామ పెద్దలు, భక్తులకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.