హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ పత్రాలపై పులి శాంతి అభ్యంతరం

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఇవ్వలేదంటూ మాజీ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్ పులి శాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాల కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా, ఒకదానికొకటి పొంతన లేని పత్రాలు ఇచ్చారని స్థానిక ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. దీంతో అధికారులు మరో సెట్‌ పత్రాలు అందజేస్తామని ఆమెకు నచ్చజెప్పారు.