హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిండు ప్రాణాలు తీసిన కోతి

NGKL: అచ్చంపేట మండలం బొమ్మనపల్లికి చెందిన సౌట బాలయ్య విధి నిర్వహణలో ఉండగా విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. రోడ్లు శుభ్రం చేస్తుండగా చెట్టుపై నుంచి కోతి ఎల్‌టీ విద్యుత్‌ లైన్‌పై పడటంతో వైరు తెగి ఆయన చేతిపై పడింది. దీంతో తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాలయ్య ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.